MAA Elections - అధ్యక్షుడిగా మంచు విష్ణు

Monday,October 11,2021 - 09:49 by Z_CLU

Actor Manchu Vishnu elected Movie Artists Association President
దాదాపు 2 నెలలుగా సాగిన ఉత్కంఠకు తెరపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచాడు. తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై 107 ఓట్ల ఆధిక్యాన్ని సాధించాడు. ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు విష్ణు.

జనరల్ ఎలక్షన్లను తలపించాయి “మా” ఎన్నికలు. మాటలు, విమర్శలు, ఆరోపణలు.. ఇలా ఏ ఒక్క ఎలిమెంట్ ను వదల్లేదు. ఒక దశలో విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసుకున్నారు. దీంతో అందరి ఫోకస్ ఈ ఎన్నికలపై పడింది. ఈ హంగామాకు తగ్గట్టే రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. అసోసియేషన్ లో 900 మందికి పైగా సభ్యులుండగా.. వాళ్లలో 883 మందికి ఓటు హక్కు ఉంది. వీళ్లలో 665 మంది ఓటేశారు. “మా” ఎలక్షన్ లో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్.

celebs-stars-at-MAA-election-polling

ఓవైపు భారీగా పోలింగ్ జరిగినప్పటికీ మరోవైపు కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, అనుష్క, సమంత, నాగచైతన్య, త్రిష, రకుల్ లాంటి వాళ్లు ఓట్లు వేయలేదు. మరోవైపు జెనీలియా ముంబయి నుంచి, జయప్రద ఢిల్లీ నుంచి వచ్చి మరీ ఓట్లు వేశారు.

celebs-stars-at-MAA-election-polling

మొత్తమ్మీద ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచాడు. అతడి ప్యానెల్ కు చెందిన రఘుబాబు జనరల్ సెక్రటరీగా, శివబాలాజీ ట్రెజరర్ గా గెలిచారు. రఘుబాబు జీవితపై, శివబాలాజీ, నాగినీడుపై గెలిచారు. కౌంటింగ్ ఆలస్యం అవ్వడంతో, మిగతా పదవులతో పాటు ఈసీ సభ్యులుగా గెలిచిన వ్యక్తుల పేర్లను మరికాసేపట్లో ప్రకటిస్తారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics