మణికర్ణికలో అదే హైలైట్ ...

Sunday,September 17,2017 - 12:06 by Z_CLU

ఇటీవలే బాలయ్య తో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ అనే హిస్టారికల్ సినిమాను తెరకెక్కించిన క్రిష్ ప్రస్తుతం కంగనా రనౌత్ తో ‘మణి కర్ణిక’ అనే మరో హిస్టారికల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ‘ఠాగూర్’ సినిమాను ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ గా హిందీలో రీమేక్ చేసిన క్రిష్ ఈ సినిమాతో మరో సారి బాలీవుడ్ లో సందడి చేయబోతున్నాడు. ఝాన్సీ రాణి లక్ష్మి భాయ్ జీవిత కథతో హిందీ , తెలుగు, తమిళ్ భాషల్లో హిస్టారికల్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలవనున్నాయట.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ఫైట్స్ కోరియోగ్రఫీ చేస్తున్నాడు.. ప్రీ ప్రొడక్షన్ టైంలోనే యుద్ధ శిక్షణ పొందిన కంగనా ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ లో అదరగోట్టేయనుందట. సినిమాకు యాక్షన్ పార్ట్ కీలకంగా నిలిచి మేజర్ హైలైట్ కానుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు శంకర్ మహదేవన్ సంగీతం అందిస్తుండడం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.