మాస్‌ హీరో విశాల్‌ 'యాక్షన్‌' టీజర్‌

Saturday,September 14,2019 - 11:31 by Z_CLU

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ దీపావళికి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యాక్షన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మాస్‌ హీరో విశాల్‌.

ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్‌ సీక్వెన్సులు ఈ టీజర్‌లో కనిపిస్తాయి. టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో అంతే అందంగా ప్రతి షాట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్‌ తమీజా అందించిన సంగీతం టీజర్‌ను ఎంతో ఎలివేట్‌ చేసేదిగా ఉంది.

మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్‌, ముఖ్యంగా బికినీలో ఆమె కనిపించడం ఆడియన్స్‌కి కనువిందు చేసేలా ఉంది. నిర్మాత ఆర్‌.రవీంద్రన్‌ సినిమాను ఎంతో రిచ్‌గా, ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగే సుందర్‌ సి. టేకింగ్‌ ఓ స్టైలిష్‌ లుక్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో విశాల్‌ అండర్‌ కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా నటిస్తున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ.