డైరెక్షన్ నుండి యూ టర్న్ !

Wednesday,September 18,2019 - 10:02 by Z_CLU

మెగా ఫ్యామిలీలో వరుణ్ డిఫరెంట్ రూట్ సెట్ చేసుకొని హీరోగా అందరిని మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ‘వాల్మీకి’ లో ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ క్యారెక్టర్ లో ఒదిగిపోయి మెగా యంగ్ హీరోల్లో వరుణ్ వేరయా అనిపించుకుంటున్నాడు. అయితే వరుణ్ హీరో అవుతాడని ఊహించలేదట. లేటెస్ట్ గా వాల్మీకి ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నాడు మెగా ప్రిన్స్.

మన ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు. సో నువ్వు డైరెక్షన్ వైపు వెళ్తే బెటర్ అని వరుణ్ కెరీర్ ను డిసైడ్ చేసారట నాగబాబు. ఆ దిశగా పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పెట్టాలని అనుకున్నారట. వరుణ్ ‘చిరుత’ సినిమాకు దర్శకత్వ శాఖలో చేరాలనుకున్నాడట. కానీ రెండు సీను పేపర్లు చూసి తనకి అంత సీన్ లేదనుకొని డైరెక్షన్ కి చెక్ పెట్టేసాడట. నిజానికి ముందు నుండి వరుణ్ కి హీరో అవ్వాలనే కోరిక బలంగా ఉండేదట.

చివరికి ఎలాగోలా నాన్నని కన్విన్స్ చేసి అలాగే పెదనాన్న ఆశీస్సులతో హీరో అయిపోయానని చెప్పుకున్నాడు వరుణ్. నిజానికి పూరి గారితోనే మొదటి సినిమా చేయాలి కానీ కుదరలేదు. మళ్ళీ ‘లోఫర్’ కి ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ వచ్చిందని తెలిపాడు వరుణ్.