Acharya Ugadi Special - సిద్ద-నీలాంబరి ప్రేమ

Tuesday,April 13,2021 - 02:10 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో సిద్ధ అనే స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు రామ్ చరణ్. సినిమాలో చరణ్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో పూజ లుక్ రివీల్ చేస్తూ చరణ్ -పూజ స్టిల్స్ తో ఓ పోస్టర్ వదిలి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్.

షడ్రుచుల సమ్మేళనం సిద్ధ-నీలాంబరిల ప్రేమ అంటూ సినిమాలో చరణ్-పూజ లవ్ ట్రాక్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని హింట్ ఇచ్చారు. అలాగే పోస్టర్ ద్వారా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలియజేశారు. ఇటివలే ఆచార్య సెట్ లో అడుగుపెట్టి కొన్ని సన్నివేశాల్లో నటించింది పూజ. చరణ్ -పూజ లపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించిన యూనిట్ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడతాయని అంటున్నారు.

acharya ugadi poster

అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల 13 న ‘ఆచార్య’ థియేటర్స్ లోకి రావాలి. కానీ కరోన మళ్ళీ వ్యాప్తి చెందుతుండటం, తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ బాగా ఉండటం వల్ల విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ మేకర్స్ పోస్ట్ పోన్ సంగతి చెప్పనున్నారు. మెగాస్టార్-మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆచార్య తో వీరిద్దరూ ఆ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ ని షేక్ చేస్తారేమో చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics