Acharya Teaser - వింటేజ్ చిరు వచ్చేశారు

Friday,January 29,2021 - 06:07 by Z_CLU

Acharya Teaser Review
ఈ ఇయర్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటి ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఈరోజు ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ తో ప్రేక్షకులకు వింటేజ్ చిరంజీవిని చూపించాడు కొరటాల.

అటుఇటుగా 60 సెకెన్ల రన్ టైమ్ ఉన్న టీజర్ సూపర్ గా ఉంది. అదిరిపోయే విజువల్స్ కు అదే రేంజ్ లో ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ ఫెక్ట్ గా సింక్ అయింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ చేయడం ఇంకా బాగుంది.

ఇక చిరంజీవి విషయానికొస్తే.. ఇప్పటికీ మెగాస్టార్ లో అదే ఎనర్జీ, అదే గ్రేస్. చిరంజీవి ఎలివేషన్స్ అదిరిపోయాయి. మెగాస్టార్ డ్రెస్సింగ్, స్టయిల్, డైలాగ్ డెలివరీ సింప్లీ సూపర్బ్. చిరు చెప్పిన డైలాగ్, పాకెట్ నుంచి చేయి బయటకు తీయకుండా చేసిన ఫైట్ టీజర్ కు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాయి.

ఈ ఒక్క టీజర్ తో అంచనాల్ని డబుల్ చేశాడు కొరటాల. మెగాఫ్యాన్స్ ఆకలి తీర్చేలా, సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్నాడు ఆచార్య.