మెగాస్టార్ రెడీ.. అనుమతి రావడమే ఆలస్యం

Thursday,May 28,2020 - 02:06 by Z_CLU

టాలీవుడ్ మళ్లీ స్టార్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. జూన్ ఫస్ట్ వీక్ లేదా రెండో వారం నుంచి షూటింగ్స్ కూడా మొదలుకాబోతున్నాయి. అయితే ముందుగా ఏ సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయనే సస్పెన్స్ మాత్రం ఉంది. ఈ సస్పెన్స్ కు తెరదించారు మెగాస్టార్.

అవును.. పర్మిషన్స్ వచ్చిన వెంటనే ముందుగా సెట్స్ పైకి వెళ్లేది మెగాస్టార్ ఆచార్య సినిమా మాత్రమే. ఈ మేరకు యూనిట్ కు, దర్శకుడికి చిరంజీవి సమాచారం అందించారు. ప్రభుత్వం సూచనల మేరకు లిమిటెడ్ క్రూతో, ముందుజాగ్రత్త చర్యలతో షూటింగ్ కు ఏర్పాట్లు చేయాల్సిందిగా చిరంజీవి యూనిట్ కు చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కొత్తలో తనకుతానుగా సినిమా షూటింగ్ ఆపేశారు చిరంజీవి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇలా స్వచ్ఛంధంగా షూట్ ఆపేసి అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో సినిమాను మళ్లీ రీస్టార్ట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంటున్నారు చిరంజీవి. ఆచాార్య షూటింగ్ లో పరిస్థితులు, కష్టనష్టాలు చూసి మిగతా యూనిట్లు తమ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేస్తాయన్నమాట.