Acharya ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ ?

Friday,February 05,2021 - 05:18 by Z_CLU

కొరటాల శివ డైరెక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య‘ కి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ యమా స్పీడ్ గా జరుగుతుందట. ఇటివలే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పడంతో డిస్ట్రిబ్యూటర్స్ ‘ఆచార్య’ నిర్మాతలతో డీల్ క్లోజ్ చేసుకుంటున్నారట. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 150 కోట్ల వరకు జరిగిందని సమాచారం.  ‘బాహుబలి ‘, ‘సాహో’ సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఆ లిస్టులో నెక్స్ట్ ఇప్పుడు ‘ఆచార్య’ నే నిలవనుందని అంటున్నారు.

తాజాగా  వరంగల్ శ్రీను 40 కోట్లకు పైగా నైజాం రైట్స్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మిగతా ఏరియాలతో పాటు ఓవర్సీస్ బిజినెస్ కూడా క్లోజ్ అయిందని తెలుస్తుంది. జస్ట్ ఒకే ఒక్క టీజర్ తో తన స్టామినా ఏంటో మళ్ళీ చూపించి మెగా బిజినెస్ కి డోర్లు తెరిచారన్నమాట మెగాస్టార్. మరి సినిమా రిలీజ్ తర్వాత ఎంతటి భారీ బిజినెస్ చేస్తుందో..? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్ళ సునామి సృష్టిస్తుందో వేచి చూడాలి.

Also Check  ‘ఆచార్య’ టీజర్ రివ్యూ