ఈ వారం త్రిష.. వచ్చే వారం మహేష్

Monday,March 09,2020 - 05:25 by Z_CLU

ఆచార్య నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్ త్రిష జాయిన్ అవ్వబోతోంది. అది కూడా ఈ వారమే. త్రిష వస్తే షూటింగ్ మరింత ఊపందుకుంటుంది. ఆమె పోర్షన్ ను దాదాపు 20 రోజుల్లో ముగించాలనేది ప్లాన్.

చిరంజీవి-త్రిష ఇదివరకే కలిసి పనిచేశారు కాబట్టి వీళ్లిద్దరికి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఉండదు. సో.. దర్శకుడు కొరటాల శివకు ఇదొక అడ్వాంటేజ్. షూటింగ్ ను మరింత వేగంగా పూర్తిచేయడానికి కొరటాలకు ఇది కలిసొస్తుంది.

ఇక ఈ ప్రాజెక్టు కు సంబంధించి మరో అప్ డేట్ ఏంటంటే.. వచ్చే వారం నుంచి మహేష్ కూడా ఆచార్య సెట్స్ లో జాయిన్ అవుతాడట. ఓన్లీ మహేష్ పై కొన్ని సీన్స్ పిక్చరైజ్ చేయబోతున్నారు. 4 రోజుల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకొని, మళ్లీ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తాడు మహేష్. అప్పుడు చిరంజీవి-మహేష్ కాంబోలో సీన్స్ తీస్తారు.

ఉగాదికి ఆచార్య టైటిల్ లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.