ఆచారి అమెరికా యాత్ర రిలీజ్ డేట్ ఫిక్సయింది

Friday,January 19,2018 - 01:48 by Z_CLU

అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు రిలీజైన 2 సాంగ్స్ ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

అమెరికాలోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోనున్న సినిమా యూనిట్, మూవీ సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.

కామెడీ ఎంటర్ టైనర్స్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసే G. నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకు డైరెక్టర్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.