ఆచారి అమెరికా యాత్ర రిలీజ్ డేట్ ఫిక్సయింది

Monday,December 04,2017 - 05:56 by Z_CLU

G. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మంచి విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జనవరి 26 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్టిమేట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం సినిమాల తరవాత వస్తున్న మంచు విష్ణు, G. నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ పై టాలీవుడ్ లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే U.S., మలేషియాలోని ఎగ్జోటిక్ లొకేషన్ లతో హైదరాబాద్ షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.