'ఆచారి అమెరికా యాత్ర' అమెరికా షెడ్యూల్ పూర్తి

Wednesday,October 25,2017 - 01:30 by Z_CLU

విష్ణు మంచు, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మానందం ముఖ్య తారాగణం గా వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలేషియా మరియు హైదరాబాద్ లో రెండు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా, తాజా గా అమెరికాలో షూటింగ్ పూర్తి చేసుకొని చిత్రం బృందం హైదరాబాద్ చేరుకున్నారు.

“ఆధ్యంతం కామెడీ ప్రధానం గా సాగే చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం  తరహాలో విష్ణు చేస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా అమెరికా షూటింగ్ చేసాము,” అన్నారు దర్శకుడు. “దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ఇదివరకటి చిత్రాలవలె ఆచారి అమెరికా యాత్ర కూడా ప్రేక్షకుల పై నవ్వుల జల్లు కురిపిస్తుందని ధీమా వ్యక్తం చేసారు నిర్మాతలు కీర్తి చౌదరి మరియు కిట్టు.