అభినేత్రి-2 ట్రయిలర్... ఇంతకీ దెయ్యం ఎవరు?

Saturday,May 25,2019 - 02:08 by Z_CLU

సాధారణంగా హారర్-కామెడీ సినిమాల్లో దెయ్యం ఎవరనేది తెలిసిపోతుంది. దాని చుట్టూ కాస్త ఉత్కంఠ, ఇంకాస్త ఫన్ యాడ్ చేస్తుంటారు. కానీ అభినేత్రి-2లో కాన్సెప్ట్ కొత్తగా ఉన్నట్టుంది. దేవి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ ఫ్రాంచైజీలో అసలు ఎవరికి దెయ్యం పట్టిందో అర్థంకానట్టుంది. కావాలంటే ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూడండి

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా… నందితాశ్వేత‌, సోనూసూద్‌, స‌ప్త‌రిగి, కోవై స‌ర‌ళ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `అభినేత్రి 2`. విజ‌య్ ద‌ర్శ‌కుడు. అభిషేక్ పిక్చ‌ర్స్‌, ట్రైడెంట్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  అభిషేక్ నామా, ర‌వీంద్ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు రిలీజైన ట్రయిలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

మే 31న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుదలకాబోతోంది అభినేత్రి-2. శామ్ సంగీతం అందించిన ఈ సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు ప్రభుదేవా.