గ్రాండ్ గా సిద్ధమైన అభినేత్రి

Saturday,October 01,2016 - 09:00 by Z_CLU

 

మిల్కీబ్యూటీ తమన్న లీడ్ రోల్ చేసిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ… అభినేత్రి సెన్సార్ టెస్టుల్లో కూడా పాసయిపోయింది. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేశాడు. ప్రభుదేవాకి డ్యాన్స్ విషయంలోనే కాదు,  కథ విషయంలోనూ గ్రిప్ కాస్త ఎక్కువే. A.L. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మరికొందరు నిర్మాతలతో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడు. కథలో కాస్తయినా ఎక్సయింట్ మెంట్ లేకపోతే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు తమన్న. తన గత సినిమాలు చూస్తే ఆ విషయం ఈజీగా తెలిసిపోతుంది.

abhinetri-16

         సినిమా హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. మిల్కీ బ్యూటీని డ్యూయల్ రోల్ లో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన అభినేత్రి… డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఒకేసారి తెలుగు-తమిళ-హిందీ భాషల్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.