హాస్యం పంచిన హారర్

Saturday,October 15,2016 - 08:50 by Z_CLU

జెన్యూన్ గా కాస్తంత వినోదం దట్టించాలి కానీ సినిమా సక్సెస్ ని ఎవరూ ఆపలేరు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజైన అభినేత్రి రెండో వారం కూడా అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. నైజాంలో దాదాపు 30 వరకు అదనంగా థియేటర్లను పెంచుకున్న అభినేత్రి హెవీ కాంపిటీషన్ ఉన్న దసరా బరిలో విజయ నేత్రి అనిపించుకుంది.
abhinetri-1
తమన్నా, ప్రభుదేవా, సోను సూద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అభినేత్రి హారర్ కథాంశమే అయినా దర్శకుడు ప్రేక్షకుడ్ని బెదిరించడమే టార్గెట్ గా పెట్టుకోకుండా… నవ్వించడానికి ప్రయత్నించడం సినిమాని సక్సెస్ వైపు నడిపించింది. ఈ సినిమాతో ప్రభుదేవా మంచి కంటెంట్ ఉంటే కానీ  సినిమా తీయడు అని ఇంకోసారి నిరూపించుకున్నాడు. మరో వైపు తమన్నా యాక్టింగ్,  డ్యాన్స్ తో… అభినేత్రి సినిమా ప్రేక్షకుల వద్ద ఫుల్ మార్కులు కొట్టేసింది.