ఈ నెలలోనే థియేటర్లలోకి ABCD

Sunday,May 05,2019 - 03:01 by Z_CLU

మెగాహీరో అల్లు శిరీష్ నటించిన సినిమా ‘ABCD’. ఈ నెలలోనే ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 17న ఏబీసీడీ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్సకుడిగా పరిచయమౌతున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ABCD’ కి రీమేక్ గా అదే టైటిల్ తో వస్తోంది ఈ సినిమా. మలయాళ వెర్షన్ లో దుల్కర్ సల్మాన్ ప్లే చేసిన రోల్ లో, తెలుగులో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఓ పాట ఇప్పటికే సూపర్ హిట్ అవ్వడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

జుధా సాంధీ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మధుర శ్రీధర్, యష్ రంగినేని, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.