పేరుకే రీమేక్.. చాలా మార్పులున్నాయి

Thursday,May 16,2019 - 02:02 by Z_CLU

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘ABCD’ రేపే థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో పంచుకున్నాడు శిరీష్. మళయాళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్  రీమేక్ కాదని చెప్పుకొచ్చాడు.

శిరీష్ మాట్లాడుతూ ” ఒరిజినల్ వెర్షన్ లో ట్యూన్స్ ఒక్కటి కూడా వాడలేదు. అన్నీ కొత్త ట్యూన్స్. కేవలం సాంగ్స్ మాత్రమే కాదు, సినిమాలో సీన్స్ కూడా ఒరిజినల్ నుంచి ఓ 15 మాత్రమే తీసుకున్నాం. మిగతా సీన్స్ అన్నీ కొత్తగా రాసుకున్నాం.  సినిమాలోని  సోల్ మాత్రమే తీసుకొని కంప్లీట్ గా ఒక తెలుగు సినిమాలా తీర్చిదిద్దాం. మళయాళం వెర్షన్ లో హీరోయిన్, విలన్ పాత్రలు లేవు. తెలుగులో పెట్టాం. అలాగే కామెడీ సీన్స్ కూడా క్రియేట్ చేసాం. ఒరిజినల్ సినిమా చూసిన వాళ్లకు కూడా ABCD కొత్తగా కనిపిస్తుంది. “అన్నారు.