ABCD ఫస్ట్ డే కలెక్షన్

Saturday,May 18,2019 - 12:48 by Z_CLU

అల్లు శిరీష్, రుక్సార్ హీరోహీరోయిన్లుగా నటించిన ABCD సినిమా నిన్న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు, మొదటిరోజు వసూళ్లలో బెస్ట్ అనిపించుకుంది.

అల్లు శిరీష్ కెరీర్ లోనే అత్యధికంగా ఫస్ట్ డే వసూళ్లు రాబట్టింది ABCD మూవీ. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2 కోట్ల 25 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. వెన్నెల కిషోర్ కామెడీ క్లిక్ అవ్వడంతో పాటు.. సినిమా మొత్తం ఎంటర్ టైనింగ్ గా ఉండడంతో ఈ సమ్మర్ లో ABCD బెస్ట్ ఆప్షన్ గా మారింది.

మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి నిర్మించిన ఈ సినిమాతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. సురేష్ బాబు ఈ సినిమాను ప్రజెంట్ చేశారు.