‘ఆటగాళ్ళు’ సినిమా టీజర్ రివ్యూ

Saturday,June 09,2018 - 01:02 by Z_CLU

నారా రోహిత్, జగపతి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతుంది ‘ఆటగాళ్ళు’ సినిమా. ‘గేమ్ ఫర్ లైఫ్’ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ చేశారు ఫిలిమ్ మేకర్స్. 1: 06 సెకన్ల నిడివి తో ఉన్న ఈ టీజర్ ఇప్పుడు ఫిలిమ్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసే పనిలో పడింది.

టీజర్ బిగినింగ్ లో నారా రోహిత్ ఈ సినిమాలో ఫిల్మ్ స్టార్ గా కనిపించనున్నాడనే విషయం అర్థమవుతుంది. ఇకపోతే తన భార్యను తనే చంపాడనే అభియోగం పై  పోలీస్ కేస్ ఫైల్ చేయడంతో  సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంతకీ హీరో భార్యని చంపింది ఎవరు..? దాని వెనక రీజన్స్ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ అయితే, పవర్ ఫుల్ లాయర్ గా కనిపించనున్న జగపతిబాబు నారా రోహిత్ కి వ్యతిరేకంగా ఈ కేసును వాదించడం సినిమాలో మెయిన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

ఇమోషనల్ మర్డర్ మిస్టరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జస్ట్ ఒక్క టీజర్ తోనే డిఫెరెంట్ సినిమా అనిపించుకోవడంలో సక్సెస్ అయింది.  జూలై 5 న ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

పరుచూరి మురళీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని వాసిరెడ్డి రవీంద్ర నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము తో పాటు జితేంద్ర కలిసి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.