ఒకప్పటి స్టార్ హీరోయిన్ బయోపిక్

Wednesday,August 05,2020 - 02:14 by Z_CLU

మహానటి సావిత్రి బయోపిక్ వచ్చింది. వైఎస్ఆర్ జీవితానికి సంబంధించిన ఓ కోణంలో కూడా బయోపిక్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ సినీ-రాజకీయ జీవితంపై కూడా బయోపిక్ వచ్చింది. త్వరలోనే కరణం మల్లీశ్వరి బయోపిక్ కూడా రాబోతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి ఆర్తి అగర్వాల్ కూడా చేరింది.

తెలుగులో ఓ వెలుగువెలిగింది ఆర్తి అగర్వాల్. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఇలా స్టార్ హీరోలతో పాటు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలందరితో సినిమాలు చేసి నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది.

ఇక టాలీవుడ్ హీరోతో అప్పట్లో ఆమె ప్రేమలో పడిందనే టాక్ గతంలో నడిచింది. ఆ తర్వాత బ్రేక‌ప్‌ కూడా అయినట్టు గాసిప్స్ వినిపించాయి. ఇవన్నీ బయోపిక్ లో చూపిస్తారా లేదా అనేది చూడాలి.

2007లో ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన ఏడాదికే అతడితో విడాకులు తీసుకుంది.

ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ‌రువు త‌గ్గడానికి చేయించుకున్న లైపో ఆప‌రేష‌న్ విక‌టించ‌డంతో 2015, జూన్ 6న ఆమె క‌న్నుమూసింది.

ఆర్తి అగర్వాల్ బయోపిక్ పై ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడానికి ఇవన్నీ కారణాలే. త్వరలోనే ఆమె బయోపిక్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.