ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ డేట్

Saturday,June 03,2017 - 01:02 by Z_CLU

గోపీచంద్ లేటెస్ట్ మూవీ ఆరగుడుల బుల్లెట్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాను జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

బి.గోపాల్ మార్క్ తో, గోపీచంద్ యాక్షన్ తో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ఆరడుగుల బుల్లెట్. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. ప్రకాష్ రాజ్-గోపీచంద్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తాయని చెబుతోంది యూనిట్.

ఆరడుగుల బుల్లెట్ సినిమాకు సంబంధించి తాజాగా సాంగ్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో భారీ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో, ఈ పాటల్ని గ్రాండ్ గా విడుదల చేశారు. గోపీచంద్ కెరీర్ లో మరో సక్సెస్ ఫుల్ సినిమాగా నిలవనుంది ఆరడుగుల బుల్లెట్.