చైనాలో రిలీజ్ కానున్న ‘సీక్రెట్ సూపర్ స్టార్’

Tuesday,December 19,2017 - 06:10 by Z_CLU

‘దంగల్’ లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత చైనా బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది సీక్రెట్ సూపర్ స్టార్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా, జనవరి 19 న చైనాలోని అన్ని మిడిల్ కింగ్ డమ్ మల్టీప్లెక్సెస్ లో రిలీజ్ కానుంది.

15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 180 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, యూత్, ఫ్యామిలీ అని తేడా అనీ క్యాటగిరీస్ ని ఇంప్రెస్ చేసేసింది. ఆల్ రెడీ ‘తైవాన్’ లో రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా చైనాలోను ‘దంగల్’ రేంజ్ సక్సెస్ సాధించడం గ్యారంటీ అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

సింగర్ కావాలని కలలు కనే ఒక టీనేజర్ తో పాటు, డొమెస్టిక్  వయోలెన్స్  చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాని ఆమీర్ ఖాన్ తో పాటు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి అద్వైత్ చందన్ డైరెక్టర్. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజర్.