ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ ఇదే

Monday,May 25,2020 - 02:36 by Z_CLU

ఆది సాయికుమార్ హీరోగా, ఆట‌గాడు చిత్రంతో ప‌రిచ‌యమైన ద‌‌ర్శ‌నాబానిక్ ని హీరోయిన్ గా, జి.బి.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో మ‌హంకాళి దివాక‌ర్ నిర్మాత‌గా మ‌హంకాళి మూవీస్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ ని యూనిట్ క‌న‌ఫ‌ర్మ్ చేసింది.

లాక్‌డౌన్ కి ముందు షూటింగ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఈచిత్ర షూటింగ్ 70% పూర్తిచేసుకుంది. మిగ‌తా బ్యాల‌న్స్ షూటింగ్ ని లాక్‌డౌన్ త‌రువాత పూర్తిచేసి విడుద‌ల‌కి సిద్ధం చేయ‌టానికి నిర్మాత‌లు రెడీ అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

న‌టీన‌టులు..
ఆది సాయికుమార్, దర్శనా బానిక్, కౌశల్, ఆమని, వెన్నెల కిషోర్, శ్యామ్ కృష్ణ, ప్రియదర్శన్

టెక్నిషియ‌న్స్‌…
రచన దర్శకత్వం – జీ.బి కృష్ణ
నిర్మాత – మహంకాళి దివాకర్
కెమెరామెన్ – సతీష్ ముత్యాల
మ్యూజిక్ డైరెక్టర్ – సురేష్ బొబ్బిల
ఎడిటర్ – అమర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ – కె.వి.రమణ
స్టంట్స్ – రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శంకర్