Aadi Saikumar Payal Rajput - మరో సినిమా

Tuesday,August 17,2021 - 12:19 by Z_CLU

Aadi Saikumar Payal Rajput 2nd movie
ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి కిరాతక అనే సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆది సాయికుమార్, పాయల్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ఈ మూవీ లాంఛింగ్ కూడా జరిగిపోయింది.

డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్‌. ఇప్పుడు ఆది క‌థానాయ‌కుడిగా నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జి.గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. విజ‌న్ సినిమా బ్యాన‌ర్ పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Aadi Saikumar payal movie 2

ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా TMK అనే పేరు పెట్టారు. ఈ సినిమాతో మరోసారి ఆది సరసన నటిస్తోంది పాయల్.

ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న
ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
ఆది సాయికుమార్‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహాన్ సింగ్, థాకూర్ అనూప్ సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: విజ‌న్ సినిమాస్‌
ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాన్ జి.గోగ‌ణ‌
నిర్మాత‌: నాగం తిరుప‌తి రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: తిరుమ‌ల్ రెడ్డి యెల్లా
మ్యూజిక్‌: సాయికార్తీక్
ఎడిట‌ర్‌: మ‌ణికాంత్‌
సినిమాటోగ్ర‌ఫీ: బాల్ రెడ్డి
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌