జంగిల్ లో సాయికుమార్ తనయుడు

Wednesday,November 18,2020 - 12:24 by Z_CLU

న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ ప‌తాకాల‌పై ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతోన్న హార‌ర్ చిత్రం ‘జంగిల్’. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు.

హారర్ జానర్ లో తెరకెక్కుతోంది జంగల్. దీనికి కార్తీక్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Jangle Aadi Saikumar 1

‘చీకటిగా ఓ ఇల్లు ఆ ఇంటి నుండి అస్థి పంజ‌రాలు.. దీపం కాంతిలో వాటిని చూస్తూ షాక‌వుతున్న హీరో ఆది, హీరోయిన్ వేదిక‌’ ఇదే జంగిల్ ఫ‌స్ట్ లుక్‌. ‘ఆది శ్వాసిస్తుంది.. అది దాక్కొని ఉంటుంది.. అది వేటాడుతుంది’ అనే క్యాప్ష‌న్‌తో సినిమాలో ఏదో భ‌యంక‌ర‌మైన జంతువో, దెయ్య‌మో ఉండ‌బోతుంద‌నే విష‌యం ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

సినిమా షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ నడుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.