మరోసారి టాలీవుడ్ స్క్రీన్ పైకి వేదిక

Monday,March 18,2019 - 03:10 by Z_CLU

వేదిక.. ఈ హీరోయిన్ తెలుగుతెరపైకొచ్చి చాన్నాళ్లయింది. కనీసం ఆమె నటించిన డబ్బింగ్ సినిమా కూడా ఈమధ్య తెరపైకి రాలేదు. అలా టాలీవుడ్ స్క్రీన్ కు దూరమైన ఈ బ్యూటీ, ఎట్టకేలకు ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

ఆది సాయికుమార్, వేదిక హీరోహీరోయిన్లుగా తెలుగు, త‌మిళ భాషల్లో ఓ సినిమా రాబోతోంది. ఈ రోజు ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కుడు. హీరోయిన్ వేదిక న‌టిస్తున్న నాలుగో తెలుగు చిత్ర‌మిది. మార్చి 25 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని త‌ల‌కోన‌లో ప్రారంభంకానుంది.

రోబో, 2.0 చిత్రాల‌కు అసోసియేట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన గౌత‌మ్ జార్జ్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సి.స‌త్య సంగీతాన్ని అందిస్తున్నారు. `అర్జున్ సుర‌వ‌రం` చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న రెండో చిత్ర‌మిది.

న‌టీన‌టులు: ఆది సాయికుమార్‌, వేదిక త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ విఘ్నేశ్‌
నిర్మాత‌: కావ్య వేణుగోపాల్‌
నిర్మాణ సంస్థ‌లు: ఎంవి అరా సినిమాస్, న్యూ ఏజ్ సినిమా, తిరు కుమర‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
మ్యూజిక్‌: సి.స‌త్య‌
సినిమాటోగ్ర‌ఫీ: గౌత‌మ్ జార్జ్‌