'ఆది సాయి కుమార్' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Tuesday,June 25,2019 - 05:40 by Z_CLU

మొన్నటి వరకూ లవ్ స్టోరీస్ , యాక్షన్ మూవీస్ తో ఎంటర్టైన్ చేసిన ఆది సాయి కుమార్ ఇప్పుడు  ‘బుర్ర కథ’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘బుర్రకథ’ ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా హీరో ఆది ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడాడు. ఆ విశేషాలు ఆది మాటల్లోనే.

సరికొత్త కథతో

ఒక మనిషిలో రెండు బుర్రలు ఉంటాయని…. ఈ కాన్సెప్ట్ చెప్పగానే కొత్తగా , ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎంటర్టైన్ మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా స్క్రిప్ట్ రెడీ చేసారు. ట్రైలర్ చూస్తే కంప్లీట్ ఎంటర్టైనర్ అనిపించొచ్చు. కానీ సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీ గా నవ్వుకుంటూ చూసే సినిమా ‘బుర్రకథ’.


అదే ఛాలెంజింగ్

సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న అభిరామ్ క్యారెక్టర్ చేసాను. అభి లాంటి క్యారెక్టర్ చాలా సినిమాల్లో చేసాను. కానీ రామ్ క్యారెక్టర్ నాకు కొత్త. ఆ క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్ అనిపించింది. ప్రేక్షకులు మాత్రం అభి రామ్ ఇద్దరినీ ఇష్టపడతారు.

 

కష్టమే .. కానీ

రెండు విభిన్నమైన ఛాయలున్న క్యారెక్టర్ అని డైరెక్టర్ చెప్పగానే ఆసక్తిగా అనిపించి చెప్తున్నప్పుడే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాను. మొదటి మూడు రోజులు రెండు షేడ్స్ ఉన్న అభిరాం క్యారెక్టర్ చేయడం కష్టం అనిపించింది. కానీ ఆ తర్వాత ఇద్దరి  మేనరిజమ్స్, బెహేవియర్, వేరియేషన్ పట్టేశాను. అప్పటి నుండి ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను.


స్క్రీన్ మీద చూడాల్సిందే

రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాలో నాకు ఫాదర్ గా నటించారు. మొదటి రోజు నుండి ఆయన సినిమాను బాగా నమ్మారు. పెద్ద హిట్ అయ్యే కాన్సెప్ట్ అంటూ ఎప్పటికప్పుడు చెప్తుండేవారు. సినిమాలో నాకు ఆయనకీ మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడాల్సిందే.

 

పృథ్వీ ఈజ్ బ్యాక్

పృథ్వీ గారు సినిమాలో హిలేరియాస్ గా నవ్విస్తారు. ఆయన కామెడీ సినిమాకే హైలైట్. ఆయన స్పూఫ్ కామెడీ మిస్ అవుతున్న ఆడియన్స్ ని మళ్ళీ నవ్విస్తారు. ఒకరకంగా  ఈ సినిమాతో స్పూఫ్ కామెడీ తో పృథ్వీ ఈజ్ బ్యాక్ అనిపిస్తారు.

 

ఫుల్ క్లారిటీతో

డైమండ్ రత్నం గారు ఆయనకున్న రైటింగ్ పవర్ వాడి ఫుల్ క్లారిటీతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయనకిది మొదటి సినిమా కావడంతో అందరి నుండి బెస్ట్ అవుట్ పుట్ తీసుకొని సినిమాను రెడీ చేసారు. ఈ సినిమా ఆయనకీ మంచి డెబ్యూ అవుతుంది. రిలీజ్ తర్వాత ఆయనకి దర్శకుడిగా ఇంకా గుర్తింపు వస్తుంది.

 

పర్ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సినిమాకు సాయి కార్తీక్ అందించిన సాంగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. కథకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ స్కోర్ ఇచ్చారు.

మనలో ఇద్దరుంటారు

నిజానికి మనలోనే ఇద్దరుంటారు. అప్పుడప్పుడు స్విచువేషన్ ని బట్టి బిహేవ్ చేస్తుంటాం. అది అందరిలో కామన్ గా ఉండే పాయింట్. అదే సినిమాలో రెండు మైండ్స్ అనే కాన్సెప్ట్ తో చూపించాం.

 

నా అదృష్టం

ఈ కథ నాకు రావడం, సినిమా రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్ తో పాజిటీవ్ టాక్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మేము చెప్పాలనుకున్న కాన్ఫ్లిక్ట్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. టీజర్ రిలీజ్ అయనప్పటి నుండి ఇప్పటి వరకూ అంతా పాజిటీవ్ గానే ఉంది.

 

రెండు సినిమాలు రెడీ

నేను హీరోగా నటించిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’,’జోడీ’ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. త్వరలోనే వాటి రిలీజ్ డేట్స్ అనౌన్స్ మెంట్ ఉంటుంది.