ఆది సాయి కుమార్ ఇంటర్వ్యూ

Wednesday,November 01,2017 - 07:06 by Z_CLU

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా దూసుకెళ్తున్న ఆది సాయికుమార్ ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. భారీ హైప్ తో నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాతో నెక్ట్స్ హిట్ కొట్టేది నేనే అంటున్నాడు ఆది. నెక్ట్స్ నువ్వే హైలెట్స్ ను మీడియాతో పంచుకున్నాడు.

ఫుల్ కాన్ఫిడెన్స్ తో…

డిసెంబర్ లో.. ప్రభాకర్ గారు నాకు ఓ మెసేజ్ పెట్టారు .. నేను ప్రభాకర్ నీతో ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి ఆది అంటూ ఆయన మెసేజ్ చూసి వెంటనే నెక్స్ట్ డే ఆయన్ని కలిశాను. ఆయన చేసిన కొన్ని సీరియల్స్  చూశాను.. టాలెంట్ తెలుసు కాబట్టి  ఫుల్ కాన్ఫిడెన్స్ తో కథ విన్నా. ఒక 20 నిమిషాలు నాకు పాయింట్ తో పాటు కొన్ని సీన్స్ చెప్పారు. ఆయన కథ చెప్పే విధానం చూసి డైరెక్టర్ గా ఇంకా  బాగా తీస్తారనిపించింది. నిజంగా ఆయన ఎక్స్ పీరియన్స్ తో సినిమాను బాగా తీశారు.

అస్సలు ఊహించలేదు

నా ఫ్రెండ్స్ కొందరు తమిళ్ లో ఈ సినిమా చూసి చాలా బాగుంది నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు కనుక్కుంటే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నారని తెలిసింది.. కట్ చేస్తే  ప్రభాకర్ – బన్నీ వాస్ గారి ద్వారా తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ వస్తుందని ఊహించలేదు.

అదే టైంలో…

ఈ సినిమా ఓకే అయింది.. బన్నీ వాస్ గారు కూడా మాట్లాడాడు.. అంతా పాజిటీవ్ గా ఉన్న టైంలోనే ‘శమంతకమణి’ సినిమా కూడా రావడం, అందులో నేను చేసిన కార్తీక్ క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీ గా ఫీలయ్యాను.

కచ్చితంగా తేడా తెలుస్తుంది

ఒరిజినల్ కు ఈ సినిమాకు చాలా మార్పులు చేశారు. ఆల్మోస్ట్ 70 % చేంజ్ ఉంటుంది. మెయిన్ కథను తీసుకొని బ్యాలెన్సింగ్ గా  తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగా తీర్చిదిద్దారు. ఒరిజినల్ సినిమా చూసి ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఆ తేడా తెలుస్తుంది.

36 రోజుల్లో పూర్తి చేశాం

ఏప్రిల్ లో ఈ సినిమాను స్టార్ట్ చేసి 36 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. మూడు పెద్ద బ్యానర్లు, బన్నీ వాస్ గారి విజన్, ప్రభాకర్ గారి ఎక్స్ పీరియన్స్ తో అనుకున్న టైంలో సినిమాను ఫినిష్ చేయగలిగాం.

అది పెద్దగా ఆలోచించలేదు

ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే హారర్ అని పెద్దగా ఆలోచించలేదు. హీరోగా అన్ని జానర్లలో సినిమాలు చేయాలనుకుంటాను.. జానర్ ఏదైనా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండాలనుకుంటా.. అందుకే కథ – స్క్రీన్ ప్లే , మంచి ప్రొడ్యూసర్స్ ఇలా అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశా.

ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ..

హారర్ కామెడీ జానర్ సినిమా అంటూ రొటీన్ గా ఫీలయ్యే వాళ్ళని ఈ సినిమా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాకు కనెక్ట్ అయితే ఆడియన్స్ రొటీన్  ఫీలవ్వకుండా ఎంటర్టైన్ అవుతారు.. అలా కనెక్ట్ అయ్యే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో చాలా ఉంది.

సీరియల్ డైరెక్టర్ గా…

ఈ సినిమాలో కిరణ్ అనే సీరియల్ డైరెక్టర్ గా కనిపిస్తా.. డైరెక్టర్ గా రాజమౌళి అంత అవ్వాలని కోరిక కానీ.. డైరెక్ట్ చేసేది ‘సంసారం సేమియా ఉప్మా’ అనే సీరియల్..  సీరియల్ డైరెక్ట్ చేయడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేసి అప్పులపాలవుతాను. ఆ  అప్పుల వల్ల ఓ రిసార్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఏదో జరుగుతుండడం, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం.. ఇలా నా క్యారెక్టర్ డిజైన్ చేశారు.

అప్పటి నుంచి ఆయనతో చేయాలనుకున్నా

ఈ సినిమాలో బ్రహ్మాజీ గారు నాతో పాటే  ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలో ఆయన క్యారెక్టర్ చూసినప్పటి నుంచి ఆయనతో వర్క్ చేయాలనుకున్నా. ఫైనల్ గా ఈ సినిమాతో కుదిరింది. బ్రహ్మాజీ గారు మినహా మిగతా వారందరితో ఆల్రెడీ నటించా కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయనే స్పెషల్.

యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది

వైభవి ని లవ్ చేస్తూనే రేష్మి కి లైనేస్తుంటా.. మా ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇద్దరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మా నలుగురితోనే కథ నడుస్తుంది.

అలాంటి కథలొస్తే ఎప్పుడూ రెడీనే

‘శమంతకమణి’ తర్వాత అలాంటి స్క్రిప్ట్ అయితే రాలేదు. ప్రెజెంట్ సోలో హీరోగానే సినిమాలు చేస్తున్నా. కానీ అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ తో కథలొస్తే మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎప్పుడు రెడీనే.

‘నెక్స్ట్ నువ్వే’ తో మూడు సినిమాలు

ప్రెజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉండగానే జ్ఞానవేల్ రాజా గారు మూడు సినిమాల ఆఫర్స్ ఇచ్చారు. మూడు ప్రాజెక్ట్స్ రెడీ గా ఉన్నాయి..బైలింగ్విల్ ప్లాన్ చేద్దామని నాతో సైన్ చేయించుకున్నారు. ఈ సినిమాతో మూడు సినిమాలు రావడం చాలా హ్యాపీ. రెండు సినిమాలు తమిళ్ లో ఉంటాయి. మూడు సినిమాల్లో ఒకటి ఈ సినిమా  ఒరిజినల్ డైరెక్టర్ తో చేస్తుండగా ఇంకొకటి విజయ్ అనే కొత్త డైరెక్టర్ తో చేస్తున్నా.. ఇవి కాకుండా స్టూడియో గ్రీన్ తెలుగులో ఓ స్ట్రయిట్  సినిమా ప్లాన్ చేస్తున్నారు.. అది మళ్ళీ ప్రభాకర్ గారితోనే ఉండొచ్చు.

నెక్స్ట్ మూవీస్ డీటెయిల్స్..

విశ్వనాధ్ అనే డైరెక్టర్ తో నేను చేస్తున్న నెక్స్ట్ సినిమా ఆల్మోస్ట్ ఫినిష్ అయింది.. ఇప్పటికే దాదాపు 80 % షూట్ అయిపోయింది. అది కంప్లీట్ లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్. ఇది కాకుండా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో విజయ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నా.. అది ఒక షెడ్యూల్ పూర్తయింది.