`చుట్టాలబ్బాయి` పాటలు విడుదల

Monday,July 18,2016 - 05:09 by Z_CLU

 
ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’ త‌మ‌న్ మ్యూజిక్ అందించిన చుట్టాల‌బ్బాయి ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం ఇటీవలే జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర‌మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ముఖ్య అతిధిగా హాజ‌రై చుట్టాల‌బ్బాయి ఆడియోను ఆవిష్క‌రించి తొలి సిడీని డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు అంద‌చేసారు. యువ హీరో సుధీర్ బాబు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ…”పి.జె.శ‌ర్మ ఫ్యామిలీ ఎంతో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చింది. ఈరోజు ఆ ఫ్యామిలీ నుంచి ఆది హీరోగా రావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆది డ్యాన్స్, ఫైట్స్ చాలా బాగా చేస్తాడు. ఒక హీరో నుంచి ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటారో అవ‌న్నీ ఆదిలో పుష్క‌లంగా ఉన్నాయి. కొత్త‌త‌రాన్ని ప్రొత్స‌హించాల్సిన బాధ్య‌త నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల పై ఉంది. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ దొర‌క‌ని ప‌రిస్థితి. ప్ర‌భుత్వం సినిమా రంగానికి సంబంధించిన ఒక్కో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ వ‌స్తుంది. త్వ‌ర‌లో థియేట‌ర్స్ స‌మ‌స్యను కూడా ప‌రిష్క‌రిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు. సినిమా పై మ‌క్కువ‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన రామ్, వెంక‌ట్ ల‌ను అభినందిస్తున్నాను. డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ తెరకెక్కించిన చుట్టాల‌బ్బాయి పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ…” చుట్టాల‌బ్బాయి ఆది కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ కావాలి. ఆది ప‌ర్ ఫార్మెన్స్, వీర‌భ‌ద్ర‌మ్ టేకింగ్, త‌మ‌న్ మ్యూజిక్ క‌లిసి ఖ‌చ్చితంగా చుట్టాల‌బ్బాయి చిత్రానికి పెద్ద విజ‌యం అందిస్తుంది అన్నారు.

శ్రీమ‌తి జీవిత మాట్లాడుతూ…” మా ఫ్యామిలీకి, సాయికుమార్ ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది. ఆ అనుబంధం జీవితాంతం కొన‌సాగుతుంది. ఈ సినిమా స‌క్సెస్ సాయికుమార్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి ఎంత ముఖ్య‌మో నాకు అంతే ముఖ్యం. చుట్టాల‌బ్బాయి వంద రోజులు ఆడాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాం అన్నారు.

హీరోయిన్ న‌మిత మాట్లాడుతూ…” ఈ చిత్రంలో వెర్స‌టైల్ క్యారెక్ట‌ర్ చేసాను. మంచి క‌థ‌తో రూపొందిన చిత్రంలో న‌టించ‌డం ఆనందంగా ఉంది అన్నారు.

డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి మాట్లాడుతూ… “చుట్టాల‌బ్బాయి ఆడియో వేడుక ఇంత ఘ‌నంగా జ‌ర‌గ‌డం చాలా ఆనందంగా ఉంది.ఆది, సాయికుమార్ గారు క‌లిసి ఫ‌స్ట్ టైమ్ న‌టించారు. ట్రైల‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది. ఈ చిత్రం చేసే అవ‌కాశం ఇచ్చిన మా నిర్మాత‌లు రామ్, వెంక‌ట్ గార్ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఈ సినిమా త‌ర్వాత మా నిర్మాత‌ల‌కు చుట్టాల‌బ్బాయి అనేది ఇంటి పేరుగా మారుతుంది. అంత గొప్ప చిత్రాన్ని నిర్మించారు. ఒక మంచి చిత్రం తీసాం. అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాం” అన్నారు.

నిర్మాత‌లు రామ్ – వెంక‌ట్ మాట్లాడుతూ…” మా డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ ప‌ని రాక్ష‌సుడు. ఈ సినిమా చాలా బాగా తీసాడు. మేము ఈ సినిమాని నిర్మించాం అంటే దానికి కార‌ణం వీర‌భ‌ద్ర‌మ్. ఆయ‌న‌కి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. సినిమా బ్ర‌హ్మాండంగా వ‌చ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంది అని ఆశిస్తున్నాం. క‌ష్ట‌ప‌డి మంచి చిత్రాన్ని నిర్మించాం. ప్రేక్ష‌కులు ఆద‌రించి విజ‌యాన్ని అందించాలి” అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మాట్లాడుతూ… ఆదితో ఎప్పుడో ఒక సినిమా వ‌ర్క్ చేయాలి కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇప్పుడు చుట్టాల‌బ్బాయి చిత్రానికి కుదిరింది. ఆదికి చుట్టాల‌బ్బాయి ద్వారా పెద్ద విజ‌యం రావాల‌ని కోరుకుంటున్నాను.వీర‌భ‌ద్ర‌మ్ తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీ. రామ‌జోగ‌య్య గారు, వ‌రికుప్ప‌ల యాద‌గిరి మంచి సాహిత్యం అందించారు” అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ.. .సంవ‌త్స‌రం పాటు క‌ష్ట‌ప‌డి మా డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్ర‌మ్ గారు ఈ సినిమాని తీసారు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మ‌న్ మ్యూజిక్ కి డ్యాన్స్ చేయాల‌నేది నా డ్రీమ్. అది ఈ సినిమా ద్వారా నెర‌వేర‌డం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో నాన్న‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ….” ఆది తో క‌లిసి న‌టించాలి అని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. అయితే…మేమిద్ద‌రం క‌లిసి ఒక మంచి సినిమా చేయాలి అనుకుంటున్న త‌రుణంలో ఈ సినిమా సెట్ అయ్యింది. ఆదితో క‌లిసి న‌టించ‌డం నాకు కిక్ ఇచ్చింది. ఆది అభిమానులంద‌రికీ చుట్టాల‌బ్బాయి. వీర‌భ‌ద్ర‌మ్ చాలా బాగా రూపొందించాడు. త‌మ‌న్ ఫ్యామిలీతో చిన్న‌ప్ప‌టి నుంచి అనుబంధం ఉంది. ఆది మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ చేయ‌డం సంతోషంగా ఉంది. మంచి స్టోరీ, సాంగ్స్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంట‌ర్ టైన్మెంట్…ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. చుట్టాల‌బ్బాయి చిత్రాన్ని చూసి ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను” అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సుధీర్ బాబు, సందీప్ కిష‌న్, రాజ్ త‌రుణ్‌, ర‌ఘ‌బాబు, రైట‌ర్స్ కోన వెంక‌ట్, బి.వి.ఎస్ ర‌వి, అనిల్ రావిపూడి, సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ‌,  నిర్మాత శివ‌కుమార్, పృథ్వీ, గీత ర‌చ‌యిత‌లు రామ‌జోగ‌య్య శాస్త్రి, వ‌రికుప్ప‌ల యాద‌గిరి త‌దిత‌రులు పాల్గొన్నారు..