Aadhi Pinisetty - మరో మూవీ రెడీ
Thursday,December 17,2020 - 03:02 by Z_CLU
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), ఆకాంక్ష సింగ్ జంటగా నటిస్తున్న మూవీ CLAP (క్లాప్). ఇదొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ. పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది.
శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
లాక్డౌన్ తర్వాత ఈమధ్య చెన్నైలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసి, ముగించారు. టోటల్ 65 వర్కింగ్ డేస్లో షూట్ పూర్తయింది. చెన్నైలోని స్టేడియంలో చిత్రీకరించిన స్పోర్ట్స్ బేస్డ్ సీన్లు ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు మేకర్స్.