అథ్లెట్‌గా ఆది పినిశెట్టి

Tuesday,May 07,2019 - 05:30 by Z_CLU

 లేటెస్ట్ గా ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు  సైన్ చేసాడు ఆది పినిశెట్టి . ఈ సినిమాతో  ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. స్పోర్ట్స్ జోన‌ర్ లో  ఆది న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ సినిమాను తెలుగు, త‌మిళ్‌లో ఏక‌కాలంలో రూపొందించ‌నున్నారు.

  త‌ను క‌న్న క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి క‌థానాయ‌కుడు చేసిన ప్ర‌య‌త్నం ఏంట‌నేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, ఈ సినిమా అథ్లెటిక్స్ ప‌ట్ల అంద‌రికీ ఆస‌క్తిని రేకెత్తించేలా ఉండనుందని చెప్తున్నాడు దర్శకుడు.

 బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ పై ఐబీ కార్తికేయ‌న్  ఈ సినిమాను నిర్మించనున్నాడు.  పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.