ఫిబ్రవరి నుండి 'AA20' షూటింగ్ !

Sunday,January 12,2020 - 11:02 by Z_CLU

‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా రెండో షెడ్యుల్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే సైలెంట్ గా కేరళలో ఒక షెడ్యూల్ పూర్తి చేసారు సుక్కు అండ్ టీం. రెండో షెడ్యూల్ ను తమిళ్ నాడులో ఓ అటవీ ప్రాంతంలో ప్లాన్ చేస్తున్నారు.

ఫిబ్రవరి నుండి జరగనున్న ఈ షెడ్యూల్ లో బన్నీ తో పాటు రష్మిక కూడా పాల్గొననుంది. బన్నీ , మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కంప్లీట్ చేసాడని సమాచారం.