హ్యాపీ బర్త్ డే రామ్

Monday,May 15,2017 - 10:30 by Z_CLU

ఈరోజు రామ్ తన పుట్టినరోజుకు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ పుట్టినరోజు వేడుకల కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అవును.. ఇన్నాళ్లూ వైజాగ్ లోనే ఉన్నాడు రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంతా పేరుపెట్టని  ఈ సినిమా ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ లో ఉంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరిగింది.

గతంలో రామ్-కిషోర్ తిరుమల కాంబోలో నేను శైలజ సినిమా వచ్చింది. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం రామ్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. గడ్డం పెంచి, మీసకట్టు, హెయిర్ స్టయిల్ కూడా మార్చాడు. సినిమాలో రామ్ సరసన మేఘా ఆకాష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.