PVR చేతికి A.. ఫిబ్రవరి 26 రిలీజ్

Monday,January 25,2021 - 12:55 by Z_CLU

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో వస్తున్న డిఫరెంట్ థ్రిల్లర్ “A”. పోస్టర్స్, టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో A సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

అలా ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడీ సినిమా PVR చేతిలోకి వెళ్లింది. ఈ సినిమా చూసి బాగా లైక్ చేసిన పీవీఆర్ గ్రూప్.. మూవీని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చింది.

A movie Release February 26 PVR Pictures (1)

చిత్ర దర్శకుడు యుగంధర్ మాట్లాడుతూ..’ ఇప్పటివరకు థ్రిల్లర్ జోనర్స్ లో చాలా మూవీస్ వచ్చాయి. వాటన్నిటి కంటే భిన్నంగా మా A సినిమా ఉంటుంది. అనంత్ శ్రీరామ్ పాటలు, ఆయన సపోర్టు వల్ల ఈ సినిమా బాగా రావటం జరిగింది. ప్రవీణ్ బంగారి ఫోటోగ్రఫీతో పాటు విజయ్ కురాకుల మ్యూజిక్, ఆనంద్-పవన్ ఎడిటింగ్ మా చిత్రానికి హైలెట్. చిన్న సినిమా అయినా సినిమా నచ్చి పివిఆర్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది… అన్నారు.