బాహుబలి 2 పై రెహమాన్ అంచనాలు

Monday,May 22,2017 - 02:45 by Z_CLU

బాహుబలి కలెక్షన్ల వర్షం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దానికి తోడు బాహుబలి ఫ్యాన్స్ దగ్గరి నుండి సెలెబ్రిటీస్ వరకు ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసిన వారే. ఇప్పుడీ అకౌంట్ లో A.R. రెహ్మాన్ కూడా చేరిపోయాడు. బాహుబలి 2 చూశాక సోషల్ మీడియాలో ఈ సినిమా యూనిట్ ని ప్రశంసలతో ముంచెత్తాడు.

వరల్డ్ బిగ్గెస్ట్ కాన్వాస్ పై సౌత్ ఇండియన్ సినిమా ఖ్యాతిని అద్భుతంగా ఆవిష్కరించిన రాజమౌళిని, కీరవాణిని అభినందిస్తూనే, ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ట్వీట్ చేశాడు మ్యూజిక్ మ్యాస్ట్రో.