రెహ్మాన్ బర్త్ డే స్పెషల్

Saturday,January 06,2018 - 09:10 by Z_CLU

‘రోజా’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమై ఆ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా సంచలనం సృష్టించి ఆ తర్వాత తన మ్యూజిక్ తో ఎన్నో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహ్మాన్.

ప్రెజెంట్ ఏ.ఆర్.రెహ్మాన్ గా పిలువబడుతున్న రెహ్మాన్ పూర్తి పేరు అల్లా రఖా రెహ్మన్. అసలు పేరు ఏ.ఎస్. దిలీప్ కుమార్. రెహ్మాన్ తండ్రి పేరు ఆర్.కె.శేఖర్ తల్లి పేరు కరీమా బేగం. భార్య పేరు సైరా భాను రెహ్మాన్ కు ముగ్గురు పిల్లలు వారి పేర్లు ఖతీజా రెహ్మాన్, అమీర్ రెహ్మాన్, రహిమ రెహ్మాన్..

కెరీర్ స్టార్టింగ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా పనిచేశాడు రెహ్మాన్. టాలెంట్ ను గమనించి ఎన్నో పాటలకు రెహ్మాన్ తో కీ బోర్డు ప్లే చేయించారు రమేష్ నాయుడు.

రమేష్ నాయుడు తర్వాత, స్టార్ మ్యూజిక్ కాంబో రాజ్-కోటి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు రెహ్మాన్. వీరిద్దరినీ ఇప్పటికీ మొదటి గురువులుగా భావిస్తాడు.

రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన మొదటి సినిమా ‘రోజా’. దర్శకుడు మణిరత్నం ఈ సినిమా ద్వారా రెహ్మాన్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ అందించి సంగీత దర్శకుడిగా పరిచయం చేసారు. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమై సూపర్ హిట్స్ సాంగ్స్ అందించి సంచలన విజయం అందుకున్నాడు రెహ్మాన్.


ఏ.ఆర్. రెహ్మాన్ ‘స్లమ్ డాగ్ మిలినియర్’ అనే సినిమాలో ‘జయహో’ అనే పాటకు తొలిసారిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాతో ఆస్కార్ అందుకున్న ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.

ఏ మ్యూజిక్ డైరెక్టర్ అందుకోనన్ని అవార్డులు, రికార్డులు రెహ్మాన్ సొంతం. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పటి వరకూ 27 ఫిలిం ఫేర్ అవార్డులను అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు రెహ్మాన్.

ఏ.ఆర్.రెహ్మాన్ తో ఎక్కువ సినిమాలు చేసి ఘన విజయాలు అందుకున్న దర్శకుల్లో మొదటి స్థానం మణిరత్నందే. దాదాపు మణిరత్నం దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు రెహ్మానే సంగీతం అందించాడు. రీసెంట్ గా మణిరత్నం తీసిన  చెలియా సినిమాకు కూడా రెహ్మానే సంగీతం అందించాడు.


రెహ్మాన్ తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన ‘సూపర్ పోలీస్’, రాజశేఖర్ హీరో గా నటించిన ‘గ్యాంగ్ మాస్టర్’, నాగార్జున హీరోగా నటించిన ‘రక్షకుడు’, మహేష్ బాబు ‘నాని’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ సినిమాల తో పాటు నాగ చైతన్య ‘ఏ మాయ చేసావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలకు మ్యూజిక్ అందించారు.


తెలుగులో ప్రతి హీరోకు ఒకసారి మాత్రమే పనిచేసిన రెహ్మాన్.. నాగ చైతన్య నటించిన రెండు సినిమాలు ‘ఏ మాయ చేసావే’,’సాహసం శ్వాసగా సాగిపో’ లకు మ్యూజిక్ అందించడం విశేషం.

రెహ్మాన్ కు ఇష్టమైన సింగర్ జానకి. అందుకే తను కంపోస్ చేసిన సాంగ్స్ లో ఎక్కువగా జానకి తోనే పాటలు పాడిస్తాడు రెహ్మాన్.


రెహ్మాన్ ఇప్పటి వరకూ అకాడమీ అవార్డ్స్,ఫిలిం ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను పురస్కారాలను అందుకున్నారు. 2010లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు కూడా వరించింది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘2.0’  సినిమాకు సంగీతం అందిస్తున్నారు రెహ్మాన్.