ఘన నివాళి అందుకున్న 'సావిత్రి' 

Thursday,December 06,2018 - 09:00 by Z_CLU

అప్పటితరం కథానాయికల్లో ఎవరంటే ఇష్టమని ఎవరిని అడిగినా… టక్కున వినిపించే పేరు సావిత్రి. నిజానికి కథానాయికల్లో సావిత్రికున్న క్రేజే వేరు… ఆమె అభినయానికి ఫిదా అయి దేవతలా కోలేచే అభిమానులెందరో. అందరితో అమ్మ అని పిలుపించుకున్న ఘనత కూడా సావిత్రి కే దక్కింది.

‘పాతాళ భైరవి’ సినిమాతో మొదలు పెట్టిన సావిత్రి సినీ ప్రయాణం ఆమె కోమాలోకి వెళ్ళే వరకూ  కొనసాగింది. అయితే కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆ మహానటి కి ఇంకా సరైన నివాళి అందలేదనే బాధ అభిమానుల్లో మొన్నటివరకూ ఉండేది. సావిత్రమ్మ కూడా అదే ఫీలయినట్టున్నారు.. అందుకేనేమో ఈ ఏడాది ‘మహానటి’ రూపంలో ఘనమైన నివాళి అందుకున్నారు.

నిజానికి సావిత్రి జీవితాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించాలన్న ఆలోచన ఒక ఎత్తైతే.. ఆమె జీవితాన్ని అంత అద్భుతంగా తెరకెక్కించి విజయం సాదించడం మరో ఎత్తు. ఈ విషయంలో నిర్మాతలు స్వప్న , ప్రియాంక అలాగే మేన్ బిహైండ్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ని ప్రత్యేకంగా అభినందించాలి.. సినిమా చూశాక ఈ ముగ్గురినీ ఆ మహానటే ముందుండి నడిపించేదేమో అనిపిస్తుంది.

కొన్నేళ్ళుగా డిసెంబర్ 6న ఆ ‘మహానటి’ని తలుచుకుంటూ ఆరాధించే వాళ్ళందరూ ఈ ఏడాది ఆ మహానటి ఘనకీర్తిని వెండితెరపై సినిమాగా చూసి సంబరపడ్డారు. ఈ ఏడాది సావిత్రమ్మ జయంతి ‘మహానటి’తో మరింత ప్రత్యేకంగా మారింది.