A.M. జ్యోతికృష్ణ ఇంటర్వ్యూ

Tuesday,November 28,2017 - 04:38 by Z_CLU

గోపీచంద్ హీరోగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఆక్సిజన్’ నవంబర్ 30 న గ్రాండ్  గా రిలీజ్ కానుంది. రాశిఖన్నా, అనూ ఇమ్మన్యువేల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా గోపీచంద్ కి సరికొత్త ఇమేజ్ ని తెచ్చిపెట్టడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న మూవీ డైరెక్టర్ A.M. జ్యోతికృష్ణ, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అందుకే లేటయింది

నిజానికి 8 నెలల క్రితమే సినిమా రెడీ అయిపోయింది. కానీ గ్రాఫిక్స్ కి చాలా టైమ్ పట్టింది. గ్రాఫిక్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. అందుకే సినిమా లేటయింది.

అదే ఆక్సిజన్ సినిమా…

పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక టైమ్ లో చనిపోతారు. కానీ బ్రతికిన కొన్ని రోజులు దేశం కోసం ఏమైనా చేయాలనే ఆలోచన కలిగించే సినిమా ఆక్సిజన్. దాంతో పాటు సినిమాలో 3 చోట్ల థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.

 

అలా జరిగింది….

ఈ సినిమాకి అనూ ఇమ్మన్యువేల్ ప్లే చేసింది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. నిజానికి ఈ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ ని ట్రై చేశాం. డేట్స్ కుదరకపోవడంతో ఫ్రెష్ ఫేస్ ట్రై చేద్దామని అనూ ఇమ్మాన్యువెల్ ని U.S. నుండి పిలిపించాం. అనూ చాలా బాగా పర్ఫామ్ చేసింది…

3 డిఫెరెంట్ షేడ్స్ లలో…

గోపీచంద్ ఈ సినిమాలో 3 డిఫెరెంట్ షేడ్స్ లో కనిపిస్తారు. గోపీచంద్ గారి ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో చాలా డిఫెరెంట్ గా కనిపిస్తారు. అంతకు మించి ఈ సినిమాతో ఆయనకంటూ పర్టికులర్ ఇమేజ్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ…

15 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్…

సినిమాలో హీరో హీరోయిన్స్ కాకుండా మరో 15 వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. జగపతి బాబు గారు, సితార గారి నుండి బిగిన్ అయితే ప్రతి ఒక క్యారెక్టర్ కి స్ట్రాంగ్ సోల్ ఉంటుంది. ఈ సినిమా తరవాత ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అందరికీ మంచి పేరు వస్తుంది…

అందుకే సినిమాలు చేయట్లేదు…

తమ్ముడు రవికృష్ణ మంచి సినిమా చేద్దామనే ప్లానింగ్ లో నే ఉన్నాడు. మంచి స్క్రిప్ట్స్ వస్తే మంచి ప్రొడక్షన్ హౌజ్ దొరకట్లేదు. మంచి ప్రొడక్షన్ హౌజ్ కుదిరితే స్క్రిప్ట్ నచ్చడం లేదు. తన విషయంలో అందుకే ఇంత గ్యాప్ వస్తుంది.

 

యువన్ శంకర్ రాజా అలా ఫిక్సయ్యారు…

ఈ సినిమాకి మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్.. ఆయన తమిళంలో చాలా పెద్ద డైరెక్టర్. నా సినిమాకి అనగానే ఆయన చాలా ఎగ్జైటెడ్ అయ్యారు… అందునా ఆయన కంపోజ్ చేసిన తెలుగు డబ్బింగ్ సినిమాల ఆడియో సాంగ్స్ చాలా పెద్ద హిట్టయ్యాయి. అందుకే ఆయనకు తెలుగు సినిమాకు పని చేయాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా హిట్టయితే తనకింకా తెలుగులోనూ అవకాశాలు వస్తాయని కసిగా చేశారు ఈ సినిమాకి…

నాన్నకు నచ్చిందంటే సినిమా సూపర్ హిట్టే…

నాన్న ఒక సినిమా చూసి స్యాటిస్ ఫై అవ్వడమంటూ జరగదు. ఆయనకంత ఈజీగా ఏ సినిమా నచ్చదు. లాస్ట్ మినట్ వరకు ఏవో చేంజెస్ చెప్తూనే ఉంటారు. ఈ సినిమా గురించి ఆయన నాతో చెప్పడం కన్నా బయటి వారితో సినిమా బావుందని చెప్పుకున్నారు…  అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసింది సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని…