రామ్, నాగచైతన్య - ఇద్దరి కెరీర్ కి కామన్ పాయింట్

Saturday,August 19,2017 - 10:02 by Z_CLU

రామ్- నాగచైతన్యలో ప్రెజెంట్ ఒక కామన్ పాయింట్ హైలైట్ అవుతుంది. వీరిద్దరూ కలిసి ఒకే నంబర్ తో టార్గెట్ ని అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న సినిమాలు వీరికి 15వ సినిమా కావడం విశేషం కాగా, ఇద్దరూ గతంలో పనిచేసిన దర్శకులతోనే ఈ సినిమాలు చేస్తుండడం మరో విశేషం. ఇటీవలే తన 15వ సినిమాను ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో స్టార్ట్ చేసిన రామ్ ఈ సినిమాకు ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే టైటిల్ ను కూడా కంఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికే 14 సినిమాలు పూర్తిచేసుకున్న చైతూ కూడా తన 15వ సినిమాను ప్రేమమ్ ఫేమ్ చందూ మొండేటి తో చేయడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ గా తన 15 సినిమాకు సంబంధించి ‘సవ్య సాచి’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసుకున్న చైతు ఈ సినిమాతో ఓ రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక రామ్ కూడా అంతే తన 15 వ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని భావిస్తున్నాడు.

సో ఒకే నంబర్ తో పాటు తమకి సూపర్ హిట్ అందించిన దర్శకులనే రిపీట్ చేస్తూ ఆడియన్స్ ను మళ్ళీ ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. మరి చైతూ రామ్ 15 వ సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటారో..చూడాలి.