Ready For Release - సస్పెన్స్ థ్రిల్లర్ A

Tuesday,January 05,2021 - 09:01 by Z_CLU

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన సరికొత్త థ్రిల్లింగ్ చిత్రం “A” (AD ‌INFINITUM). ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మూవీకి U/A సర్టిఫికెట్ వచ్చింది. సినిమాను ఈ నెలలోనే థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ కు 5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.. ఒక చిన్న సినిమా టీజర్ కు ఇంత క్రేజ్ రావడం ఈమధ్య కాలంలో ఇదే. దీంతో “A” మూవీపై అంచనాలు పెరిగాయి.

Nithin-Prasanna-A-movie1

యుగంధర్ ముని డిఫరెంట్ పాయింట్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. నితిన్ ప్రసన్న మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అనంత్ శ్రీరామ్ పాటలు రాయగా దీపు మరియు పావని ఆలపించారు. ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించాడు.