90ఎంఎల్ ట్రయిలర్ రివ్యూ

Thursday,November 21,2019 - 01:02 by Z_CLU

డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుంటూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100లో భగ్నప్రేమికుడిగా, గ్యాంగ్ లీడర్ లో విలన్ గా కనిపించిన ఈ నటుడు.. ఇప్పుడు 90mlలో లిక్కర్ బలహీనత కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది.

ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా కథ ఏంటనే విషయాన్ని క్లియర్ గా ట్రయిలర్ చెప్పేశారు. మందు లేకపోతే హీరో బతకలేడు. పూటకు 90ml పడాల్సిందే. అస్సలు మందు వాసన అంటేనే పడని ఓ వ్యక్తి ఇంట్లోకి పడతాడు హీరో. మందు మానేస్తేనే ప్రేమిస్తానంటుంది హీరోయిన్. మధ్యలో మరో చిన్న ట్విస్ట్. ఇలా సాగుతుంది 90ml సినిమా.

పూటకు 90ml తాగే వ్యక్తిగా కార్తికేయ ట్రయిలర్ లో బాగా ఆకట్టుకున్నాడు. కార్తికేయ-నేహా సోలంకి పెయిర్ బాగుంది. సినిమాలో యాక్షన్ తో పాటు మంచి కామెడీ ఉందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది 90ml.