67th national film awards - మెరిసిన జెర్సీ, మహర్షి

Monday,March 22,2021 - 05:58 by Z_CLU

మోస్ట్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన జెర్సీ సినిమాను జాతీయ అవార్డు వరించింది. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో నేషనల్ అవార్డ్ వచ్చింది. దీంతో పాటు ఉత్తమ ఎడిటర్ విభాగంలో కూడా జెర్సీ సినిమాను ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి అవార్డ్ గెలిచాడు.

అటు సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన మహర్షి సినిమాను కూడా 2 అవార్డులు వరించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ (రాజు సుందరం) విభాగాల్లో ఈ సినిమాకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

67వ జాతీయ చలనచిత్ర అవార్డులు
ఉత్తమ సినిమా – చిచ్చోరే
ఉత్తమ నటుడు – ధనుష్ (అసురన్), మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే)
ఉత్తమ నటి – కంగనా రనౌత్ (పంగా/మణికర్నిక)
ఉత్తమ దర్శకుడు – సంజయ్ సింగ్ చౌహాన్ (బహత్తార్ హురైన్ – హిందీ సినిమా)
ఉత్తమ సహాయ నటి – పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు – విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్)