మరోసారి మెరిసిన బాహుబలి-2, ఘాజి చిత్రాలు

Friday,April 13,2018 - 03:18 by Z_CLU

ప్రభాస్, రానా కలిసి నటించిన బాహుబలి-2, రానా చేసిన పాథ్-బ్రేకింగ్ మూవీ ఘాజి సినిమాలు మరోసారి లైమ్ లైట్లోకి వచ్చాయి. ఈరోజు ప్రకటించిన 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ రెండు సినిమాలకు అరుదైన గౌరవం దక్కింది. బాహుబలి-2 సినిమాకు 3 అవార్డులు దక్కితే, ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది ఘాజి.

ఇక ఈమధ్యే కన్నుమూసిన శ్రీదేవి, ఉత్తమ నటిగా ఎంపికైంది. మామ్ సినిమాలో నటనకు గాను శ్రీదేవికి నేషనల్ అవార్డు వరించింది. వినోద్ ఖన్నాకు 2018 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కింది.

65వ నేషనల్ ఫిలిం అవార్డుల లిస్ట్

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ : వినోద్‌ ఖన్నా
ఉత్తమ చిత్రం : విలేజ్‌ రాక్‌స్టార్స్‌ (అస్సామీ)
హిందీ ఉత్తమ చిత్రం : న్యూటన్‌
జాతీయ ఉత్తమ నటి : శ్రీదేవీ (మామ్‌)
జాతీయ ఉత్తమ నటుడు : రిద్ది సేన్ (నగరకీర్తన్)
ఉత్తమ దర్శకుడు : జయరాజ్‌ (భయానకమ్‌)
బెస్ట్ యాక్షన్ డైరక్షన్ – అబ్బాస్ అలి మొఘల్ (బాహుబలి-2)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు : బాహుబలి2
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : బాహుబలి2
ఉత్తమ నృత్య దర్శకుడు : గణేష్‌ ఆచార్య (టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్ రెహ్మాన్ (కాట్రు వెలియదై)
ఉత్తమ నేపథ్య సంగీతం : ఎఆర్ రెహ్మాన్( మామ్‌)
ఉత్తమ గాయకుడు : జేసుదాసు
ఉత్తమ గాయని : షా షా తిరుపతి (కాట్రు వెలియదైలోని వాన్‌ వరువన్‌ )
ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజి
ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్‌
ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ
ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క
ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి
ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
ఉత్తమ సహాయ నటి : దివ్య దత్‌ (ఇరాదా)