'బుర్రకథ' ని చూడాల్సిందే అనిపించే టాప్ 6 రీజన్స్

Wednesday,June 26,2019 - 10:02 by Z_CLU

ఈ నెల 5న రిలీజవుతుంది ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్రకథ’ సినిమా. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజయింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది ఫిలిమ్ మేకర్స్ కూడా గట్టిగానే సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే అసలు ఈ వీకెండ్ ‘బుర్రకథ’ సినిమాని ఎందుకు మిస్ అవ్వకుండా చూసి తీరాలో డిమాండ్ చేసే టాప్ 6 రీజన్స్ ఇవే…

కథ – సినిమాలో హీరోకి 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. కాబట్టి కంపల్సరీగా సినిమా చూస్తున్నంత సేపు ఏదో కొత్తగా చూస్తున్న ఫీలింగే ఉంటుంది. నిజానికి ఇది సీరియస్ సబ్జెక్టే అయినా  మేకర్స్, సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు.

ఆది సాయికుమార్ : ఆది సినిమాలు కొత్త కాదు కానీ, ఆదిని ఇలాంటి క్యారెక్టర్స్ లో చూడటం మాత్రం డెఫ్ఫినెట్ గా  కొత్తే… అప్పుడే ఓ సాఫ్ట్ రోల్ లో ఉంటూ.. మళ్ళీ అంతలోనే యూత్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యే ఎలిమెంట్స్, ఆదిలోని యాక్టర్ ని ఎలివేట్ చేయబోతున్నాయి… ‘బుర్రకథ’లో సరికొత్త ఆదిని సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నాం.

 

ఫ్యామిలీ ఎమోషన్స్: ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఏమాత్రం లోటు ఉండదు. ఆది, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ ఫస్టాఫ్ లో ఫన్ జెనెరేట్ చేస్తే,  సెకండాఫ్ లో ఉండబోయే ఎమోషన్ సీక్వెన్సెస్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయడం ఖాయం.

యాక్షన్ సీక్వెన్సెస్ : ఇంట్రెస్టింగ్ యాక్షన్ జోన్ ఉండబోతుంది ‘బుర్రకథ’ లో… కొత్త కథని ఎంచుకున్న దర్శకుడు డైమండ్ రత్నబాబు, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పర్టికులర్ గా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ రాసుకున్నాడు. ఆది చేసే ఫైట్స్ ‘బుర్రకథ’కి వన్ ఆఫ్ ది ఎట్రాక్షన్స్ కాబోతున్నాయి.

మ్యూజిక్  : ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. సాయికార్తీక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ స్క్రీన్ పై మరింత కలర్ ఫుల్ గా ఎలివేట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆది, మిస్తీ చక్రవర్తి కెమిస్ట్రీ ఇప్పటికే రిలీజైన స్టిల్స్ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ : H.K. శ్రీకాంత్ దీపాల నిర్మించారు ఈ సినిమాని. మొదటి నుండి సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు… ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎంత రిచ్ గా ఉండబోతుందనేది తెలుస్తుంది.