సాక్ష్యం సినిమా ఎందుకు చూడాలి?

Thursday,July 26,2018 - 02:29 by Z_CLU

మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది సాక్ష్యం సినిమా. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై చాలా బజ్ నడుస్తోంది. ఇందులో మెయిన్ ఎట్రాక్షన్ ఏంటి..? ఈ సినిమాను ఎందుకు చూడాలి? ఆ టాప్-6 రీజన్స్ మీకోసం.

రీజన్ 1 : 
ఇండియన్ సినిమా హిస్టరీ లోనే పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కిన ఫస్ట్ ఎవర్ మూవీ ‘సాక్ష్యం’. ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ కి ఈ నేచర్ ఎలా సాక్ష్యమయింది..? దర్శకుడు శ్రీవాస్ ఈ కాన్సెప్ట్ ను అసలు ఎలా ప్రెజెంట్ చేశాడు అనేది సినిమాలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.

రీజన్ 2
బాహుబలి టీమ్ ఈ సినిమా గ్రాఫిక్స్ కి పనిచేసింది. పంచభూతాలను అంతే న్యాచురల్ గా ప్రెజెంట్ చేసే గ్రాఫిక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. వాటికి తోడు విజువల్ వండర్ గా తెరకెక్కింది సాక్ష్యం. కథకు తగ్గట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో అందమైన లొకేషన్లు ఇందులో కనిపిస్తాయి. భారీ కాన్వాస్ పై తెరకెక్కిన ఈ సినిమాకి అమెరికాలోని ఎగ్జోటిక్ లొకేషన్స్ ప్రత్యేక ఆకర్షణ. మరీ ముఖ్యంగా రాజమండ్రిలోని వాటర్ టన్నెల్స్ , బళ్ళారి లో మైనింగ్ ఎపిసోడ్స్, వారణాసి లోని మణికర్ణిక ఘాట్, పొలాచి… లాంటి రియల్ లొకేషన్స్ ని ఈ సినిమాలో చూడొచ్చు.

రీజన్ 3 
ఈ సినిమాకు మరో హైలెట్ యాక్షన్ సన్నివేశాలు. ఇందులో ఫైట్స్ రొటీన్ గా ఉండవు. మొత్తం 5 ఫైట్స్ ఉంటే.. దేనికదే డిఫరెంట్ గా కంపోజ్ చేశాడు యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్. దీని కోసం హీరో సాయిశ్రీనివాస్ కూడా చాలా కష్టపడ్డాడు. శాండ్ స్కేటింగ్ లాంటి టెక్నిక్స్ నేర్చుకున్నాడు. ఈ సినిమా ఎందుకు చూడాలనేదానికి ఇది
కూడా ఓ రీజన్.

రీజన్ 4 
థీమ్ యాక్షన్ సీక్వెన్సెస్ తరవాత ఈ సినిమా గురించి ఇమ్మీడియట్ గా డిస్కస్ చేయాల్సి వస్తే అది 12 నిమిషాల థీమ్ సాంగ్. ఇప్పటికే రిలీజైన ఈ ఆడియో సాంగ్, సినిమాలోని విజువల్స్ పై న్యాచురల్ గానే ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది. ఐదుగురు ఇండియాస్ బెస్ట్ సింగర్స్ పాడిన ఈ సాంగ్, సినిమాలో ఎలా ప్రెజెంట్ చేశారన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. దీంతో పాటు మిగతా పాటలన్నీ ఇప్పటికే హిట్ అవ్వడం మరో హైలెట్.

రీజన్ 5
ఫస్ట్ టైమ్ జోడీ కట్టారు బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే. ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాలో అవుట్ స్టాండింగ్ అనిపించుకోవడం గ్యారంటీ. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రోమో సాంగ్స్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక సిల్వర్ స్క్రీన్ ఈ ఇద్దరి ప్రజెన్స్ అందరినీ ఇంప్రెస్ చేయడం గ్యారంటీ.

రీజన్ 6
ఈ సినిమా ఇంత లావిష్ గా తెరకెక్కడానికి కారణం అభిషేక్ పిక్చర్స్. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు ప్రొడ్యూసర్ అభిషేక్ నామా. ఆ ఖర్చు మొత్తం సాక్ష్యం సినిమాలో కనిపిస్తుంది.