మెగాస్టార్ కుమ్ముడు మామూలుగా లేదు...

Monday,December 26,2016 - 04:45 by Z_CLU

మెగాస్టార్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో హల్ చల్ చేస్తూ దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా చిరు నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే సింగిల్ ట్రాక్ ను యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

chiru-kajal

ప్రెజెంట్ ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ వ్యూస్ తో సోషల్ మీడియాను కుమ్మేస్తోంది. ఈ మధ్య టీజర్, ట్రైలర్ తో స్టార్ హీరో లు యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధిస్తుండగా… కేవలం ఒకేఒక్క పాటతో 6 మిలియన్ వ్యూస్ సాధించి మెగా స్టామినా చూపించాడు చిరు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట రిలీజ్ నుంచి అందరి నోళ్ళల్లో నానుతోంది.