మరో రికార్డ్ సృష్టించిన నాగ్

Thursday,June 18,2020 - 12:16 by Z_CLU

సీనియర్ హీరోల్లో సోషల్ మీడియాలో నాగార్జునకు ఉన్నంత ఫాలోయింగ్ మరో హీరోకు లేదు. ట్విట్టర్ లో నాగార్జునకు ట్రెమండస్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా నాగ్ ను ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో మరో ఘనత సాధించాడు కింగ్.

నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కు ను దాటింది. సీనియర్లలో 60 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఏకైక స్టార్ నాగ్ మాత్రమే. ఈ సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ ఫ్యామిలీ కి థ్యాంక్స్ చెప్పాడు.

తన ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు నాగ్. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. దీనికితోడు స్టయిల్ ఐకాన్ ఇమేజ్ కూడా ఉండడం నాగార్జునకు ప్లస్ అయింది.