50 డేస్ సెలెబ్రేషన్స్

Friday,March 24,2017 - 02:13 by Z_CLU

నేను లోకల్ 50 డేస్ సెలెబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి. న్యాచురల్ కంటెంట్ తో రిలీజ్ అయిన నేను లోకల్ సినిమా అంతే న్యాచురల్ స్క్రీన్ ప్లే తో, అంతే న్యాచురల్ క్యారెక్టర్స్ తో రిలీజైన ప్రతి సెంటర్ లోను ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించడం లో సక్సెస్ అయింది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫుల్లీ లోడెడ్ ఫామ్ లో ఉన్న నాని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నేను లోకల్.

యూనివర్సల్ హిట్ అనిపించుకోవడంతో పాటు, 50 డేస్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న నేనులోకల్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్.