25 రోజుల్లో 50 కోట్ల గ్రాస్
Friday,June 16,2017 - 11:13 by Z_CLU
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా 50 కోట్ల గ్రాస్ సాధించింది. జస్ట్ 25 రోజుల్లో ఈ ఘనత సాధించి నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీస్ కు బాక్సాఫీస్ వద్ద తిరుగుండదని మరోసారి రుజువు చేసింది.
నాగచైతన్య-రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ ముందు నుంచే దేవిశ్రీ కంపోజ్ చేసిన పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ క్యూ కట్టారు.
అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. శివగా నాగచైతన్య, భ్రమరాంబగా రకుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్స్ గా నిలవగా… జగపతిబాబు, సంపత్ పాత్రలు బాగా క్లిక్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ పుల్ గా నడుస్తూ, సమ్మర్ సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.