ధృవ చూడ్డానికి 5 మెయిన్ రీజన్స్

Thursday,December 08,2016 - 12:02 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ధృవ’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తప్పకుండా చూడ్డానికి 5 మెయిన్ రీజన్స్ ఉన్నాయి.

dhruva-reason-1
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా కోసం కెరీర్ లోనే ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చేశాడు. ఈ సినిమాలో చెర్రీ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడు. అందుకే ఫిజిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సిక్స్ ప్యాక్ వర్కవుట్ చేశాడు. ఈ సిక్స్ ప్యాక్ బాడీ తో యాక్షన్ సీన్స్ లో దుమ్ముదులిపాడు మెగా పవర్ స్టార్. మరి ఆ యాక్షన్ సీన్స్ లో చరణ్ ఎలా అలరిస్తాడో? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

dhruva-reason-2
ఈ సినిమాకు మరో హైలైట్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ . హద్దులు దాటి మరీ తన గ్లామర్ తో కనివిందు చేయబోతుందట. ఇప్పటికే ‘పరేషాన్’ అనే సాంగ్ ప్రోమోలో తన అందచందాలతో ఎట్రాక్ట్ చేసిన రకుల్.. సినిమాలో తన గ్లామర్ యాక్టింగ్ తో మరింతగా అలరించనుందట. మరి రకుల్ హొయలు చూడాలంటె ధృవ చూడాల్సిందే.

dhruva-reason-3
ఈ సినిమాకు మరో మెయిన్ హైలైట్ అరవింద్ స్వామి. అప్పట్లో హ్యాండ్సమ్ లుక్ తో తెలుగు ఆడియన్స్ ను అలరించిన అరవింద్ స్వామి… చాలా ఏళ్ల తరువాత ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను స్టైలిష్ విలన్ గా అలరించబోతున్నాడు. ట్రైలర్ లో తన స్టైలిష్ లుక్ యాక్టింగ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన అరవింద్ స్వామి ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో సరి కొత్తగా కనిపించి డిఫరెంట్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను షాక్ చేస్తాడట.

dhruva-reason-4
ఈ సినిమాకు యాక్షన్ సీన్స్ మేజర్ హైలైట్. యాక్షన్ ఎంటర్టైనర్ కావడం తో సినిమాలో అదిరిపోయే ఫైట్స్ మాస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయట. దీనికి సంబంధించి ట్రయిలర్ లోనే కొన్ని కట్స్ చూపించి సినిమాపై హైప్ పెంచింది యూనిట్.

dhruva-reason-5

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమా స్టోరీలైన్. అసలు ఈ సినిమాను చెర్రీ టేకప్ చేయడానికి కారణమే ఈ స్టోరీ. ఆధ్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ పోలీస్ ఆఫీసర్ ఎదుర్కొనే పెద్ద సమస్య తో తెరకెక్కిన ధృవ సినిమా… ప్రేక్షకులకు హై-ఎండ్ సస్పెన్స్ ను అందించబోతోంది. ఓ దశలో ఆడియన్స్… సీట్ల అంచుకు వచ్చి కూర్చొని సినిమా చూస్తారని యూనిట్ ధీమాగా చెబుతోంది.